MahaBharath

Indian famous epic- MahaBharath story, drama & other forms of it is very popular & well integrated with people. I enjoyed in my childhood summer holidays where day program (Harikatha) and night program (Drama) performed for 18 days :)

ఎప్పటి కృష్ణుడు... ఏనాటి గీత...!వేల ఏళ్ళు దాటినా వన్నెతగ్గని మేధ!నాడు యుద్ధరంగంలోని అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నేడు... నవజీవన సమరంలోనూ మార్గదర్శే! సాధకులకు స్ఫూర్తి ప్రదాతే! యోగమంటే.... ముక్కు మూసుకొని కూర్చోవటంకాదు... ముందుకు దూకడమంది...కర్మ అంటే... కర్తవ్యపాలనంది... పనే పరమాత్మ అంది! దేవుడంటే నిత్య చైతన్యమంది....నాడు అర్జునుడికైనా... నేటి ఆధునిక మానవుడికైనా గీతాసారమదే! అలుపెరగకుండా జాలువారుతున్న ఈ మకరందం... భయాల్ని తొలగిస్తుంది...అనుమానాల్ని నివృతి చేస్తుంది వివేకాన్ని నిద్రలేపుతుంది...ఎవరి నుదిటిరాతను వారే తీర్చుకునేలా చేస్తుంది. 
ఆనందంతో బతుకుతున్నామా ?     ఆనందం కోసం పరుగెడుతున్నామా !? 
మనం జీవిస్తున్నామా !? కాలం గడుపుతున్నామా !? 


భగవద్గీత : యుద్ధరంగంలో అస్త్రశస్త్రాలను త్యజించి నైరాశ్యంలో కూరుకుపోయిన అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడానికి జగద్గురువైన శ్రీకృష్ణుడి నోట భగవద్గీత ఉద్భవించింది.
  • ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ’’ మానసిక బలహీనతలు వదిలిపెట్టి లేచి నిలబడు అనేది గీతోపదేశం! నిరాశను విడిచి పెట్టమని ఆదేశం!
  • ‘*గీత*’ మనకు లభించిన వెలకట్టలేని కానుక.ప్రతిమనిషి ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో.. భగవద్గీత వివరించినట్టుగా మరే గ్రంథం వివరించలేదు. - సీజీ యుంగ్‌, మనస్తత్వ శాస్త్రవేత్త
  • ప్రపంచ సాహిత్యమంతా కనుమరుగైపోయినా ఫర్వలేదు. భగవద్గీతలోని రెండు శ్లోకాలతో మళ్లీ అద్భుతాన్ని సృష్టించవచ్చు. *ఈ జాతి వారసత్వసంపద భగవద్గీత*. - స్వామి వివేకానంద
  • భగవద్గీత ప్రపంచ మానవాళిపై అమితమైన ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది. ఏ తరానికైనా గీత స్ఫూర్తిదాయక గ్రంథం. దీని ద్వారా మానవాళి ఎంతో అభ్యున్నతి సాధించవచ్చు. మానవీయతకు పట్టంగట్టే గ్రంథరాజం. - ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్
  • వృద్ధాప్యం హుందాగా గడపాలంటే యౌవనం ఉజ్జ్వలంగా ఉండాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా క్రమశిక్షణ పాటించాలి. భగవద్గీత ఆరో అధ్యాయం ఇదే విషయాన్ని వివరించింది.
  • ‘నైతత్త్వయుప పద్యతే’ పిల్లలను ‘నీవు చాలా మంచివాడివి, బలశాలివి అలాంటిది నీవిలా ఉండటం తగదు’ అని చెబుతుండాలి. అప్పుడే పిల్లలు గొప్పవారుగా తయారవుతారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇదే సూత్రాన్ని పాటించాలి.
  • *అంతర్గత శక్తే గురువు. ధ్యాన, జ్ఞాన, యోగాల ద్వారా శక్తిని వృద్ధి చేసుకోవాలి.ఆ శక్తిని సమాజహితం కోసం వెచ్చించాలి*
  • *నూనె, పత్తి, ప్రమిద లేకుండా దీపం ఉండదు. దేహం, మనసు, హృదయం లేకుండా మనిషి లేడు. పరస్పరం, ఒకదానిపై ఒకటి ఆధారపడినట్లు, వ్యక్తి లేకుండా సమాజం లేదు. సమాజ బలం లేకుండా వ్యక్తి రాణించడు*
  • *అధ్యయనం, అభ్యాసం, ఆచరణ ఉంటే లోకంలో అసాధ్యమన్నది లేదు*
  • -- గీత ప్రభవించిన మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. పూజించడానికో, పఠించడానికో కాదు..: ఆచరించదగిన మహాగ్రంథం భగవద్గీత!

Few snaps of prep & during Mahabharatha program, near by native !!

 









How Mahabharat characters can be applied in Corporate World ? 






 




---------------** Interesting perspective know **------------


Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Boyakonda

Jaggery making

KodiPandem