South Andhra Foods
Food is essential to human survival. Local foods prepared in traditional way gives more comfort, happiness, health (digesion) !! Some of the food items listed here are mostly consumed across Telugu speaking people. Try them based on your interest & taste.. :)
Normally food is served on a banana leaf / Banyan/Modugu vistaraaku in Rayalaseema/Andhra: [శాస్త్రోదికంగా/సామాన్యంగా, రాయలసీమ భోజనం అరటి ఆకు/విస్తరాకులో వడ్డిస్తారు]
- Rice served with ghee (అన్నము, దానిపై కొద్దిగా నెయ్యి.)
- Some times Palaav / Biryani's (కొన్ని సందర్బాలలో పలావ్ లేదా బిర్యానీ)
- Dal with Chutney / Pachadi / Vepudu / Podi (పప్పు మరియు చేట్నీ, వేపుడు, పోడులు, ఊరగాయ, బజ్జీలు)
- Curry (Koora / Pulusu) (కూర మరియు పులుసు )
- Sambar / Chaaru (Rasam) (సాంబార్ మరియు (పప్పు) చారు (రసం))
- Papads / Odiyaalu (అప్పడాలు మరియు ఒడియాలు)
- Curd / Buttermilk (పెరుగు/మజ్జిగ )
- Sweet, Banana, Pan (చివరగా ఒక స్వీటు, అరటిపండు, తాంబూలం/పాన్)
Watch The History of Food in Ancient India for better clarity !!
Given below are mostly available in Rayalaseema region of Andhra Pradesh (South part of India)
Soups & Sprouts | Starters / side dishes | Main Dishes |
|
| |
|
|
BreakFast | Deserts | Other - like Powders |
|
|
|
Ayurvedic foods
| Light Dinner
|
|
Rayalaseema Special Foods | Rayalaseema Curries | Rayalaseema sweets: |
|
|
where
- Koora – Koora is a generic word for a protein-based dish
- Pulusu (sour) is a curry-like stew that is typically sour and cooked with tamarind paste.
- Vepudu (fry): crispy fried vegetables
- Pappu Koora (lentil-based dish): boiled vegetables stir-fried with a small amount of half-cooked lentils (dal)
- Podi (powdered dal-based condiment or seasoning): mixed with rice and a spoonful of ghee or sesame oil.
- Charu (diluted than a sambar) Or Pappucharu (thick dal broth) or
- Ooragaya (pickle), avakaya, gongura, nimmakaya etc.
- Pachadi (Pasty/saucy condiment or chutney): kobbari (coconut), tomato, gongura, dosakaya, gummadikaya, allam (ginger).
హిందూ సాంప్రదాయంలో భోజన సమయంలో పాటించవలసిన నియమాలు (one more article here )
- భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
- తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
- ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం.
- అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.
- భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
- ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.
- ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.
- సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.
- నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. బఫే పద్దతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలు తో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.
- భగవదార్పితం చేసి,భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.
- అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.
- పరిషేచనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.
- కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వర్తించదు)
- మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. మన ఇంటి చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు.
- భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు (వెంట్రుకలు కత్తిరించడం).
- గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తేమనం తినగా మిగిలినవి పెట్టరాదు. వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.
- భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.
- భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
- వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
- భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం.
- ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు
- భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం తింటూ మధ్యలో) వేదం చదువరాదు.
- పళ్ళెం మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.
- భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.
- స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.
- అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు తిన్న విస్తరిని మడవడం అనాచారం తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.
- ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది
- భోజనం అయ్యాక రెండు చేతులూ, కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి.
- భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి (మెతుకులు తీసేసి, తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు
- స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము. పెద్దలు, సదాచారపరాయణులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడాని కి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు, పాచిముఖం తో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
- ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది.
- ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.
ఎందుకు పాటించాలి అంటే ?? _మాకు తెలిసిన కొన్ని వాటిని వివరించాము ఇక్కడ.._ 😉
- మనిషి, చెట్లు అన్ని భూమి నుండి వస్తాయి, అలానే భూమిలోకి వెల్తాయి అని మనకు తెలుసు..అలానే మనిషి పుట్టుకకి - నక్షత్రాలకి సంబంధం ఉంది అనేది తెలుసు..
- తామరాకులో/ అరటి ఆకులో భోజనం శ్రేష్టం: అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులలో ఉంటాయి, ఆకలి పెరుగుతుంది. అలాగే సహజ రుచిని అందిస్తుంది. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి.
- సాంప్రదాయాలు మంచివి వందల సం. లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అలా కానివి ఎప్పుడో మరుగున పడ్డాయి..🤔
- సాంప్రదాయం అనేది ఒక ప్రవర్తనా నియమావలి (Best Practice) మాత్రమే..పాటించడం పద్దతి, అది పెళ్ళి కానివ్వండి, పండుగ కానివ్వండి. 😎
- వీలైనంత వరకు, మంచి పద్దతులను మన తరువాతి తరాలకు (పిల్లలకి) అందిద్దాం..మంచి జీవితాలు జీవించేట్టు ప్రయత్నిద్దాము. 🙏🏼
- పరిశుభ్రంగా తినడం వలన మలినాలు మన వంటిలోకి వెల్లవు. (అంటువ్యాధులు తగ్గించవచ్చు) 👍🏼
- వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర దిక్కులలో కూర్చుని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. [ఆహారం మన ఆరోగ్యానికి, మన శరీరం పొందే శక్తికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.]
- మన భోజనం అనేది మనసు ప్రశంతంగా ఉంచుకొని కూర్చొని తినాలి..నిలబడి తిన్నప్పుడు, ప్రశాంతత తక్కువ మరియు, అన్నం/కూర లాంటివి కింద/పక్క వారి మీద పడటం జరుగుతొంది.. !! అలానే, పాదరక్షలు అనేవి ఎక్కడెక్కదో తిరిగి వస్తాము కాబట్టి, ఆ మలినాల్ని వదలి కడుక్కోని తినాలి అని పెద్దలంటారు..
- తినడము వలన, అన్నము/కూర మరకలు బట్టలమీద పడితే: చీమలు, క్రిములు వస్తాయి అలానే ఉతకడము కష్టం.
- భోజనం మితంగా తిని, కొద్దిగా మిగిల్చి (ఒక ముద్ద) బయట వేయడము పద్దతి అని, ఆ మిగిల్చిన కొద్ది ఆహారం కుక్కలు, ఎలుకలు మరియు చీమల్ తిని జీవిస్తాయి అని..🤩
- సహజంగా అరటి ఆకు పూర్తిగా తిన్నారో లేదో తెలీదుగా..అలానే ఏది పూర్తిగా తిన్నారో, ఏది తినలేదొ తెలుస్తుంది అని ఒక నానుడి.. 🤔
- స్నానం చేస్తే పరిశుభ్రంగా మరియు ఆహ్లదంగా ఉంటుంది, అప్పుడు వంట చేస్తే రుచిగా ఉంటుంది అని..! 😊
- పెద్దలను అడిగి తెలుసుకొందాం.. 🤔🌱 - 🌱🌾అన్నదాత సుఖీభవ 🙏🏼 ......- మేకల వీ.రెడ్డి
Good food items in (old) Chittoor Dist, AP: చిత్తూరు జిల్లాలోని మంచి ఆహారపధార్థాలు...దొరికే ప్రదేశాలు: , prepared & documented by - Mekala V Reddy
- దోసలు (Dosa's):
- మదనపల్లి: బ్రాహ్మన్ మెస్ (Govt Hospital దగ్గర), సెట్టి గారు మెస్ (near SBI, CTM Rd)
- దోసలు & గుంతపొంగనాలు: ఏడంవారిపల్లి, చిన్నగొట్టిగల్లు దగ్గర
- Double Egg దొసలు - భాకరాపేట
- మురుకులు, అత్తిరాసాలు, చక్కబిల్లలు (Snacks):
- మొగిలి: మురుకులు (Near Chittoor-Palamner highway)
- చిన్నగొట్టిగల్లు: మురుకులు, నిప్పట్లు (సెట్టి గారి దగ్గర - on orders or Buy)
- భాకరాపేట: సద్ద వడలు, కజ్జక్కాయలు, పెద్దవాళ్ళు (Elderly couple ) చేసి అమ్ముతున్నారు - రుచి, శుభ్రత ఉన్నట్టున్నాయి. రుచి చూడండి - location
- మదనపల్లి: శెఖర్ స్వీట్స్/నందా స్వీట్స్,, బర్మా వీదిలోని ఇళ్ళలో కూడా అమ్ముతారు.
- ఉరగాయలు, పొడులు(Pickles & Powders): బర్మా వీది (near Sai Temple), మదనపల్లి.
- (మసాలా పెట్టిన) బొరుగులు, చిక్కీలు, పప్పులు: బొరుగులంగడి (behind Busstand), పలమనేరు
- బొరుగులు మాత్రమే అయితే చౌడేపల్లి
- భోజనము (Meals):
- తిరుపతి: బీమాస్ (veg), రెడ్డెమ్మ మెస్ (non-veg), బిర్యానిలు: మినర్వా,
- మదనపల్లి: సెట్టి గారు మెస్ (near SBI, CTM Rd)
- చిత్తూరు: MSR Hotel (బిర్యానిలు), శ్రీ విష్ను భవన్ (Meals)
- పీలేరు: అంబాసిడర్ హొటెల్
- కంజు (Quail) కబాబ్/బిర్యాని, ఆనంద్ బార్, మదనపల్లి
- రాగి, సజ్జ వడలు, నువ్వుంటలు, మసాల చెనిగ్గింజలు: Prakruti vanam, CTM, మదనపల్లి , బొరుగులంగడి (behind Busstand), పలమనేరు
- Coffee/Tea -మరి మంచి తేనీరు , కాఫీ, !? ఇరాని చాయ్: మదనపల్లి,
- మిరపకాయ భజ్జీలు: మదనపల్లి (కట్ మిర్చి బజ్జి), తిరుపతి గాంధిబజార్
- జొన్న రొట్టేలు, రాగి రొట్టేలు, బియ్యపు రొట్టేలు: ?
(మీరు చెప్పండి తెలిస్తే.. లేదా మార్పులు, చేర్పులు ఉంటే..)
ఆంధ్రా వారి ఆకు కూరలు- వాటి ఉపయోగాలు:
కు తెలిసినవి ఇక్కడ పొందుపరిచాను. ఇంకా ఏవైనా ఉంటే, తెలుపగలరు.. మేకల వీ. రెడ్డి. - 01 Nov '23
- అవిశాకు (Agati /Vegetable hummingbird) ఫ్రై / కూర: Kidney stones ; Read more..
- మునగాకు (Drumstick leaves) ఫ్రై: high vitamin ; Read more..
- ముల్లంగి (Raddish leaves) ఆకు ఫ్రై: Read more..
- కరివాపాకు (Curry Leaves) పోడి: ; Read more..
- చింతాకు (చిగురు) (Tamarind Leaves) పోడి, పప్పు: ; Read more..
- గోంగుర (Kenaf) పచ్చడి, పప్పు, మాంసం: ; Read more..
- బచ్చలి (Malabar Spinach) ఆకు పప్పు: ; Read more..
- తోటకూర/ధంటాకు ఫ్రై: ; Read more..
- పొన్నగంటి /కొనగంటాకు ఫ్రై: ; Read more..
- మెంతాకు (Fenugreek leaves) రోటి, పప్పు: Diabetics ; Read more..
- పాలాక్ (Spinach) పప్పు, కర్రి: ; Read more..
- గురుగాకు పప్పు: ; Read more..
- కాశి/కామంచి ఆకు పప్పు: ; Read more..
- శిర్/సిర్రాకు ఆకు ఫ్రై, పప్పు: ; Read more..
- ఎర్రబద్దాకు ఫ్రై: ; Read more..
- అరటి / అటిక మామిడి ఆకు ఫ్రై: ; Read more..
- సబ్బక్కి ఆకు ఫ్రై: ; Read more..
- కప్పరెల్లి/ వామాకు (Ajwain Leaves) బజ్జి: ; Read more..
- నల్లేరు చెట్ని: ; Read more..
- పొదీనా (Mint Leaves) చెట్ని: ; Read more..
- రెడ్డి వారి నానుబాలు మొక్క/పచ్చ బొట్లాకు పప్పు: ; Read more..
- కోడి జుట్టు ఆకు: ; Read more..
- అమృతకాడ మొక్క: ; Read more..
- ఆవాలు (Mustard Leaves) ఆకు ఫ్రై: ; Read more..
- కొత్తిమిర చేట్ని(Coriander/Dhania): Read more..
- బలుసు ఆకు పప్పు:
- చేమ ఆకులు ఫ్రై:
- (లేత) గుమ్మడి ఆకులు/కాడలు ఫ్రై:
- చుక్క ఆకు (Garden Sorrel) కూర/ ఫ్రై:
- ఉల్లి కాడలు (Sprint Onion) ఫ్రై:
- గరిక-Grass:
- అరటి పువ్వు /కాండం ఫ్రై:
- గుంట గింజాకు చెట్నీ-Gunta ginjaku chetney:
- వాయిటాకు-Vaayitaaku:
- శుంకేశులాకు-Sunkesula aaku :
- గేదారాకు - Geydaaraku
Note: For pictures of above & English names, refer here or above links :)
In General, Food / Snack items in 2020's:
Snacks & Other foods popular, now a days are (how to make - procedure)
- Tirumala Pulihora - Recipe
- మధుర మీనాక్షి గుడాన్నా ప్రసాదం - Recipe
- Ulava Chaaru (Horse gram rasam) , Ulava chaaru-2
- Aloo-cheese sticks
- Five Morsels of Love (Rayakaseena special foods)
- Chicken Biryani's
- Bamboo foods: Bamboo Chicken and Bamboo Omlete
- Nati-Kodi pulusu + Ragi Mudda - Recipe
Rayalaseema was projected as factionalism & politics mixed violence area by media !!
సిరిధాన్యలు (Positive Grains)
- కొర్రలు (Foxtail Millet , Rs. 65/- Kg –U, Rs. 35/- kg – R)
- ఊదలు(Bamyard Millet , Rs. 140/- Kg-U, Rs. 50/- Kg - R)
- అరికలు(Kodo Millet, Rs. 150/- Kg)
- సామలు(Little Millet, Rs. 160/- Kg)
- అండుకొర్రలు(Bowntop Millet)
తటస్థ ధాన్యలు (Neutral Grains)
- సజ్జలు (Pearl , Rs. 120/- Kg -U, Rs. 30/- Kg -R)
- రాగులు(Finger , Rs. 30/- Kg )
- ఓరిగలు(Proso , Rs. 120/- Kg )
- జొన్నలు(Great Millets, Rs. 60/- Kg – U, Rs. 25/- Kg - R),
- మొక్కజొన్న(Com Maize , Rs. 50/- Kg -U, Rs. 25/- Kg -R),
నస్టధయక ధాన్యలు (Negative Grains)
- గోదుమలు(Wheat, Rs. 50/- Kg – U, Rs. 20/- Kg – R)
- వరి బియ్యం(Paddy Rice, Rs. 50/- Kg – U, Rs. 30/- Kg - R)
Where U = Urban / on-line on flipcart / amazon & R = Rural towns whole sale
Worth to visit places in Chittoor Dist, AP
- Talakona Water falls, vi Bhakarapet (Temple, Treck, Water Falls, Forrest)
- Mallayya Konda, ThamballaPalli (Temple, Treck)
- NelaMalleswara Swamy Temple, Nimmanapalli
- GudiMallam,
- Reddemma Konda, ChinnaMandem
- Boya Konda Ammavari Temple
- ChandraGiri Fort, and Kalyani Dam/Reservoir Near Tirupati
- Puli Gundlu, near Chittoor
- Abhayaranya Anjaneya Temple, near Palamner
Comments
Post a Comment