Posts

Showing posts from December, 2017

MahaBharath

Image
Indian famous epic- MahaBharath story, drama & other forms of it is very popular & well integrated with people. I enjoyed in my childhood summer holidays where day program (Harikatha) and night program (Drama) performed for 18 days :) ఎప్పటి కృష్ణుడు... ఏనాటి గీత...!వేల ఏళ్ళు దాటినా వన్నెతగ్గని మేధ!నాడు యుద్ధరంగంలోని అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నేడు... నవజీవన సమరంలోనూ మార్గదర్శే! సాధకులకు స్ఫూర్తి ప్రదాతే! యోగమంటే.... ముక్కు మూసుకొని కూర్చోవటంకాదు... ముందుకు దూకడమంది...కర్మ అంటే... కర్తవ్యపాలనంది... పనే పరమాత్మ అంది! దేవుడంటే నిత్య చైతన్యమంది....నాడు అర్జునుడికైనా... నేటి ఆధునిక మానవుడికైనా గీతాసారమదే! అలుపెరగకుండా జాలువారుతున్న ఈ మకరందం... భయాల్ని తొలగిస్తుంది...అనుమానాల్ని నివృతి చేస్తుంది వివేకాన్ని నిద్రలేపుతుంది...ఎవరి నుదిటిరాతను వారే తీర్చుకునేలా చేస్తుంది.   ఆనందంతో బతుకుతున్నామా ?     ఆనందం కోసం పరుగెడుతున్నామా !?   మనం జీవిస్తున్నామా !? కాలం గడుపుతున్నామా !?   భగవద్గీత : యుద్ధరంగంలో అస్త్రశస్త్రాలను త్యజించి నైరాశ్యంలో కూరుకుపోయిన అర్జునుడికి కర్తవ్యాన్ని బ

telugu Stories

Image
Few Telugu short stories .....to read & relax or to share with kids. *గోరంత దీపం*      "ఎంత సేపు వెయిట్ చెయ్యలి?"  కౌంటర్ దగ్గర తన పేరు తో ఫైల్ తయారవగానే డబ్బులు అందిస్తూ అడిగింది పూజ.       "మేడమ్ , మీ నెంబర్ పన్నెండు. మీ ముందు పదకొండు మంది పేషెంట్లు ఉన్నారు." నవ్వుతు బదులిచ్చింది కౌంటర్ లోని అమ్మాయి.      "షిట్" తాను వేసుకున్న హీల్ తో నేలని ఒక తన్ను తన్ని " ఐ విల్ కమ్  అగైన్" అంటూ బయటకి నడిచింది పూజ . అసలీ బాబాయి ననాలి . ఆఫ్ట్రాల్ ఫిజిషియన్ ట.  ఈయన కౌన్సెలింగ్ ఇచ్చే దేమిటి?ఏ రోజు అపాయింట్మెంట్లు ఆ రోజేనట. మై ఫుట్. ఎంత టైం వేస్ట్? అసలే సెవెన్ కి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. అయినా తను సిటీ లోనే ఫేమస్ బోటిక్ ఓనర్ .ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఫూల్ లా నిలబడటమేమిటి? ఒక్క ఫోన్ కాల్ చేస్తే వంద మంది డాక్టర్లు తన గుమ్మం లోనే ఎదురు చూస్తారు.          క్లినిక్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో కాఫీ తాగటం ముగించింది పూజ. ఏడిసినట్టుంది  ఈ కాఫీ కూడా . ఈ డాక్టర్ చుట్టం ఎవరిదోనే అయి ఉంటుంది